కాయ్ రాజా కాయ్.. 50కీ 150….100కీ 3౦౦లు

కాయ్ రాజా కాయ*50కీ 150….100కీ 3౦౦

– పోలీసుల కనుసదానంలోనే

-జాతరకు వచ్చిన భక్తులకు జేబులు ఖాళీ

– బహిరంగంగా ఆడుతున్న పట్టించుకోని పోలీసులు మేళ్లచెరువు మార్చి 3 ( నిజం న్యూస్ ) మేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన కొందరు ఆటగాళ్లు పచ్చ గుండు నల్ల గుండు ఆట మొదలు పెట్టి కాయ్ రాజా కాయ్ 50 కి 150 ……100కీ 300 అంటూ కేకలు వేస్తూ ఆటను యదేచ్ఛగా ఆడిస్తున్నారు. పోలీస్ వారితో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జాతర చూసేందుకు వచ్చిన భక్తులు వారి జేబులు ఖాళీ చేసుకొని వెళ్తున్నారు. మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఈ ఆట మాత్రం నిలువరించ లేకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది .