వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి!

తుంగతుర్తి శాసనసభ్యులు, గాదరి కిషోర్ కుమార్.

తిరుమలగిరి, మార్చి 3, నిజం న్యూస్

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ₹20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు, తదనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘ఆయుష్ గ్రామ్’ కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించి, ప్రత్యేకంగా ఆయుష్ గ్రామ్ కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.