భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

*భార్యను హతమార్చిన భర్త*

 

కృష్ణా, మార్చ్ 3,(నిజం న్యూస్)

వత్సవాయి మండలం

పాత వేమవరం గ్రామంలో భార్యను హత్య చేసిన భర్త

 

పాత వేమవరం గ్రామానికి చెందిన నారపోగు రఘుకు రమాదేవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది

వీరికి ఇద్దరు సంతానం. గత కొంతకాలంగా హైదరాబాదులో కూలి పనులు చేస్తూ జీవనం సాగించారు.

ఈ మధ్యనే స్వగ్రామానికి విచ్చేశారు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది.

 

ఈ క్రమంలో కత్తితో భార్య రమాదేవి గొంతుకోసి హత్య చేశాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్, వత్సవాయి ఎస్ఐ మహా లక్ష్మణుడు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

 

బుధవారం రాత్రి ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడ్డారని సమయంలోనే నాన్న కత్తితో అమ్మ పై దాడి చేసి చంపేశారని పెద్ద కుమార్తె మానస పోలీసులకు తెలిపింది..