ఎదురుకాల్పుల్లో రివార్డ్… మావోయిస్టు మృతి

ఎదురుకాల్పుల్లో రివార్డ్… మావోయిస్టు మృతి
చర్ల మార్చి 3 (నిజం న్యూస్) చర్ల మండల సరిహద్దులోని సతీష్ గడ్ దంతేవాడ జిల్లా లో బుధవారం జవాన్లకు నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు మృతి చెందిన నక్సలైట్ లఖ్మా కవాసీగా గుర్తించారు. ఇతనిపై గతంలో ప్రభుత్వం రూ3. లక్షల రివార్డుకూడ ప్రకటించింది విశ్వసనీయ సమాచారం మేరకు కాటేకళ్యాణ్ అడవుల్లో 10 నుంచి 15 మంది సాయుధ నక్సలైట్లు ఉన్నారని పోలీసులకు అర్ధరాత్రి సమాచారం అందింది సమాచారం మేరకు పోలీసులు దంతేవాడ నుండి డి ఆర్ జి .జవాన్ల బృందాన్ని ఆ ప్రాంతంలో వెతికేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అప్పటికే పొంచి ఉన్న నక్సలైట్లు సైనికులపై కాల్పులు జరిపినట్లు సమాచారం