సీత కు సహాయం చేసిన ఎమ్మెల్యే కిషోర్

దివ్యాంగురాలు సీతకు, 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే!

మంచి మనసున్న మహారాజు యువ కిశోరం
ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .

తుంగతుర్తి, మార్చి 2, నిజం న్యూస్

శాలిగౌరారం మండల పర్యటనలో భాగంగా బుధవారం రోజున పెర్కకొండారం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మండవ సీత కు తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతూ, ఉండడానికి ఇళ్లు లేక మరోవైపు కుటుంబం ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నా విషయం ఎమ్మెల్యే గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి *తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ వారి ఇంటి నిర్మాణానికి తక్షణ సాయం క్రింద ₹50,000/- (యాభై వేల రూపాయలు) ఆర్థికసాయం అందజేసి, ఆకుటుంబానికి నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు ఎమ్మెల్యే సహాయానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.