లక్ష మంది భక్తులతో ఘనంగా ముగిసిన శివార్చన..!

లక్ష మంది భక్తులతో ఘనంగా ముగిసిన శివార్చన..!
శివ నామ స్మరణతో మారుమోగిన ఎములాడా..!
లలిత కళలకు వెన్నెలవాడ వేములవాడ..!
శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు
రాజన్న సిరిసిల్ల, మార్చ్2 (నిజం న్యూస్):
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఎం.ఎల్.ఏ రమేష్ మాట్లాడుతూ మొదట మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు భక్తులందరికీ తెలియజేస్తూ ఎక్కడ చూసినా శివ భక్తుల ఓమ్ నమః శివయ నామ స్మరణతో మారు మొగిందని, ఈ శివార్చన జరుగు ప్రాంగనంలో వున్న 35 ఎకరాలలో వేలాది మంది ఈ శివార్చనలో జరిగే నృత్య , జానపద, పేరిణి, ఒగ్గు, ఇతర శివ భక్తి కార్యక్రమాలను తిలకించడం, జాగరణ చేయడంలో భక్తి భావం వెల్లడవుతుందన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శివార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా అద్భుతమైన పరిణామం అని, మొట్ట మొదటి సారి శివార్చన కార్యక్రమంలో ఎలాంటి కళలు ప్రదర్శించాలని చర్చ జరిగినపుడు మొదట పేరిణి నృత్యం తప్పకుండా ప్రదర్శించాలని, పేరిణి నృత్యం పౌరుషంతో పాటు ఓరుగల్లు ఔన్నత్యం ఈ రెండు భావాలను వ్యక్తీకరించడం మన కళాకారులు గత 6 సంవత్సరాలుగా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అని అన్నారు. కళల్లో మన రాష్ట్రం చిర స్థాయిలో నిలుస్తోందని, భరత నాట్యం అంటే కేవలం దేవాలయాల్లోనే కాదు ఎక్కడైనా జరుగుతుంది అని ఈ నృత్యాలు చూసి తిలకిస్తుంటే తెలుస్తోందన్నారు. రెండు రోజుల నుండి ఈ భాషా, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తుంటే రెండు కనులు సరిపోవడం లేదని అంత అద్భుతంగా కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు. కనుమరుగై పోతున్న కళలను బయటికి తీసువస్తు, గత 6 సంవత్సరాలుగా శివార్చన కార్యక్రమాన్ని యింత అద్వితీయంగా మంచి పేరు తీసుకు వస్తున్న భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ గారి పాత్ర అద్వితీయమని అందుకు వారికి మా ధన్యవాదాలు. శివుని చెంత ఇంతటి గొప్ప కార్యక్రమాలు జరగడం గొప్ప సంతోషం అన్నారు. కళాకారుల్ని ఎన్ని సార్లు అభినందించిన అది చాలా తక్కువేనని, ఈ శివార్చనలో 2,200 మంది కళాకారులు కనబర్చిన వారి ప్రతిభ, పాటవాలు చూడడం మన అదృష్టం అన్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో త్వరలో నృత్య, నాట్య పాఠశాల రాబోతున్నదన్నారు. ఇంతటి చక్కని శివార్చన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి లకు వేములవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని రకాల సాంప్రదాయాలను, కళల ప్రోత్సాహానికి నా వంతు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, మున్సిపల్ చైర్మన్ మాధవి, ఆలయ ఈ.ఓ రమాదేవి, ప్రభుత్వాధికారులు, పట్టణ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.