త్వరలోనే మిగిలిన జిల్లాల YSR తెలంగాణ పార్టీ కో-ఆర్డినేటర్ల నియామకం

YSR తెలంగాణ పార్టీ తరఫున ఇప్పటివరకు ప్రకటించిన అన్ని రాష్ట్ర, పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీలను(పార్లమెంట్ కన్వీనర్లు, కోకన్వీనర్లు, అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాలు) రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాల వారీగా పార్టీ కోఆర్డినేటర్లను మాత్రమే అధిష్టానం నియమించింది. నియోజకవర్గాలకు ఎటువంటి ఇంచార్జీలను గానీ, కోఆర్డినేటర్లను గానీ నియమించలేదు.
YSR తెలంగాణ పార్టీ అన్ని కమిటీలు రాష్ట్రఅధికార ప్రతినిధులు,పార్లమెంటు,నియోజకవర్గ ఇన్చార్జులు,మండలం, గ్రామం, అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లు అలాగే 12 జిల్లాలకు కో-ఆర్డినేటర్ లను నియమించడం జరిగింది. మిగతా జిల్లాలకు త్వరలోనే కో-ఆర్డినేటర్ లను నియమించనున్నట్లు తెలిపారు రద్దు చేయబడిన కమిటీలు పదవులను ప్రచురించవద్దని ysrtp రాష్ట్ర పార్టీ ప్రకటనలో తెలిపారు.