ఉద్యోగం రావడం లేదని మనస్థాపంతో నిరుద్యోగి మృతి

ఉద్యోగం రాలేదని మనస్థాపంతో నిరుద్యోగి మృతి

రాజన్న సిరిసిల్ల, మార్చ్2 (నిజం న్యూస్):

వేములవాడ మండలం కాషయపల్లి గ్రామంలో గోస్కుల ప్రశాంత్ అనే నిరుద్యోగి గ్రామ శివారులో తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఉద్యోగం రావట్లేదని రెండుసార్లు కానిస్టేబుల్ కు, మిల్ట్రీ కి ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం రాలేదని చెప్పుకుంటూ ఆవేదన చెందే వాడని బంధువులను అన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.