పెట్రోల్ 20 ml తక్కువ పోసారని ఆందోళన

*మోసాలకు పాల్పడుతున్న గంభీరావుపేట అనూష పెట్రోల్ పంపు*
*వెంటనే చరియలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వాహనదారులు*
*గంభీరావుపేట మార్చి 2(నిజం న్యూస్):*
గంభీరావుపేట మండల కేంద్రంలో మోసాలకు పాల్పడుతున్న అనూష ఫిల్లింగ్ స్టేషన్ అను పెట్రోల్ పంపు.వివరాల్లోకి వెలితే బుధవారం గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గంట అశోక్ అనే వ్యక్తి పెట్రోల్ కోసం వాటర్ బాటిల్ తీసుకొని అనూష పెట్రోల్ పంపు కి వెళ్లి ఒక లీటర్ పెట్రోల్ పోయించుకున్నాడు. బాటిల్ లో ఒక్క లీటర్ కంటే తక్కువ పెట్రోల్ ఉన్నదని అనుమానంతో కిరాణా షాపు నుంచి ఒక్క లీటర్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి పొలిస్తే పెట్రోల్ 20 మిలి లీటర్ వరకు తక్కో రావడంతో గంట అశోక్ ఆందోళనకు దిగాడు.వెంటనే స్థానిక తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం పోలీస్ అధికారులు పెట్రోల్ పంపు వద్దకు వచ్చి తక్కో వచ్చిన పెట్రోల్ బాటిల్ ని తమ వెంట తీసుక వెళ్లారు. అనంతరం గంట అశోక్ మాట్లాడుతూ నిత్యం వందలాది గా వాహనాలలో పోస్తున్న పెట్రోల్ లో భారీగా వ్యత్యాసం లీటర్ పెట్రోల్ కు గాను ఈ విధంగా తక్కువగ పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అట్టి పెట్రోల్ పంప్ అను వెంటనే తనిఖీ అధికారులు తనిఖీ చేసి తక్షణ చర్యలు తీసుకోగలరని డిమాండ్ చేసారు.