దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
శాలిగౌరారం, మార్చి 2 ,నిజం న్యూస్
శాలిగౌరారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ మరియు అంగన్వాడీ టీచర్లకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ట్రై సైకిళ్లు అందించడం అభినందనీయమని అన్నారు. కరుణ మహమ్మారి లో గ్రామాల్లో మేమున్నామంటూ ముందుకు వచ్చి రోగులకు, వైద్య సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు చీరలు అందించడం, నాకు ఎంతో సంతోషం గా ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని, అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమందరం వెన్నంటి ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అయితగాని వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.