హాస్సిక గుండె మార్పిడికి సాయం చెయ్యండి ప్లీజ్

హాస్సిక గుండె మార్పిడికి 30 లక్షలు కావాలి

-అమ్ముదామంటే
ఏలాంటి ఆస్థిపాస్తులు లేవు

-గుండె సంభందిత వ్యాధి నయం కోసం ఎడులక్షల అప్పు చేసి ఖర్చు చేసిన నయంకాలేదు

-ధాతలసహాయం కోరుతున్న కడునిరుపేద కుటుంబమిది

-గుండె మార్పిడి చికిత్స ప్రభుత్వ పరంగా చేయించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడండి

ఎల్లారెడ్డిపేట, మార్చి 02,(నిజం న్యూస్):

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన కడుపేదరికం అనుభవిస్తున్న
ముత్యాల బాలరాజ్ ప్రమీల దంపతుల పెద్ద కుమార్తె హస్సిక గుండె సంభందించిన వ్యాదితో గత కొంతకాలంగా బాధపడుతుంది. దీంతో ఆమే వ్యాదిని నయంచేయించడానికని హైదరాబాద్ లోనీ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తిప్పారు.కూలీ నాలీ చేసుకొని కుటుంబ జీవానాన్నీ సాగించే దంపతులిద్దరూ కన్న బిడ్డ తమ కల్లెదుట గుండె సంబంధించిన వ్యాదితో తల్లడిల్లిపోతుంటే తట్టుకోలేక పోయారు. నా బిడ్డ కంటే ఏక్కువ ఏముందని సుమారు ఏడు లక్షల రూపాయల వరకు స్వగ్రామమైన సింగారం లో గ్రామస్తుల వద్ద అప్పులు చేశాడు. నయం చేయించడానికి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చుచేశారు అయినా నయం కాలేదు.ఏడు లక్షల రూపాయల కు వడ్డికి వడ్డీ తడిసిమోపెడుఅవుతున్నాయి.
చేతిలో చిల్లిగవ్వ కూడాలేని ఆ దంపతులిద్దరు తమ బిడ్డ హాసిక భాధను తట్టుకోలేక ఇటీవల హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ కు చికిత్స కోసం తీసుకపోగా గుండె మార్పిడి చికిత్స చేయించాలనీ అందుకోసం 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని. బాల్ రాజు ప్రమీల దంపతులు విలేఖరుల ఏదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు.తమలాంటి పేదవారికి ఇలాంటి పెద్ద వ్యాదులస్తే నయం కావాలంటే ఆ భగవంతుడు లేదా దాతలే దిక్కుఅని వారు కన్నీటీపర్యంతమయ్యారు.
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రభుత్వ పరంగా మా బిడ్డ కు గుండె మార్పిడి చికిత్స చేయించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని ముత్యాల బాల్ రాజ్ ప్రమీల దంపతులు విజ్ఞప్తి చేశారు. దాతలు ఈ క్రింద ఇచ్చిన లింక్‌లో విరాళం ఇవ్వవచ్చు
https://www.impactguru.com/fundraiser/help-hasnika
– ఖాతా సంఖ్య : 90927059802855
– ఖాతా పేరు: హస్నిక
– IFSC కోడ్: IDFB0020101
UPI లావాదేవీ కోసం: [email protected]