విపక్షాలు ఎందుకు తెగించడం లేదు !
గతంలో ఎప్పుడూ ఇంత బాహాటంగగా ప్రభుత్వరంగ సంస్థలను ఏ ప్రభుత్వం కూడా అమ్మకానికి పెట్ట లేదు. అందులో లాభాల్లో ఉన్న..ప్రజల పోరాటంతో తెచ్చుకున్న సంస్థలను తెగనమ్మలేదు. ఎల్‌ఐసి లాంటి సంస్థలను అమ్మడం దారుణం కాక మరోటికాదు. అలాగే ప్రాణత్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కును తెగనమ్ముతామని చెప్పినా అధికార, విపక్షాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగంగా ప్రైవేటీకరణ గురించి ప్రకటన చేసినా ఎందుకనో విపక్షాలు పెద్దగా స్పందించడం లేదు.
ప్రభుత్వం వ్యాపారం చేయదని, ప్రభుత్వరంగ సంస్థలను మోయదని ప్రధాని మోడీ ప్రకటించినా ఏ ఒక్క నాయకుడు కూడా దానిని గట్టిగా వ్యతిరేకించడంలేదు. మోడీకి వ్యతిరేకంగగా ప్రాంతీయ పార్టీలను కూడ గడుతామని చెబుతున్న వారెవరూ కూడా దీనిని వ్యతిరేకించడం లేదు. విశృాఖ ఉక్కు విషయంలో అధికార వైసిపి, విపక్ష టిడిపి, అధికారం కోసం రెడీ అంటున్న కాంగ్రెస్, బిజెపిలు కూడా గట్టిగా నిలదీ యడం లేదు.
దేశంలో విపక్షాల అనైక్యతే మోడీ బలంగా ఉంది. అందుకే మోడీ నిర్ణయాలకు తిరుగు లేకుండా పోతున్నది. అప్పనంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతామని గత రెండేళ్లుగా ప్రకటించినా అలా ఎలా చేస్తారని అనడంలేదు. ప్రధాని ప్రకటనను వ్యతిరేకిస్తారని అంతటా భావించారు. యుద్దం చేస్తారని అనుకున్నారు. కానీ దేశంలో విపక్షాలు చేవచచ్చి తమ స్వలాభం కోసం ఎన్నికల్లో లబ్దిపొందడమే లక్ష్యంగా చూస్తున్నాయి. కనీసం ఒక్క సిఎం కూడాగట్టిగా స్పందించడంలేదు.
తెలుగు రాష్టాల్ర సిఎంలు జగన్, కెసిఆర్‌లు కూడా అదేకోవలో ఉన్నారు. కెసిఆర్ గట్టిగా మాట్లాడుతున్నా అవి తెలంగాణ దాటి ఢల్లీిని చేరడం లేదు. విశాఖ ఉక్కును కూడా చుట్టి అవతలపడేస్తామన్న రీతిలో ప్రయత్నాలు సాగుతున్నా వ్యతిరేకించే చర్యలు కానరావడం లేదు. కనీసం గట్టిగా మాట్లాడి మోడీకి సమాధానం ఇవ్వడం లేదు. ఇలా చేయడం వెనక ఆయా పార్టీలకు భయం ఉందా లేక…మరేదైనా మతలబు ఉందా అన్నది తెలియడం లేదు. అంతెందుకు ఆయా రాష్టాల్ల్రో కూడా ప్రభుత్వాలు తెగనమ్మడం చేస్తూనే ఉన్నాయి.
ప్రధాని మోడీ తానే చేసేదంతా దేశం కోసమే అని చెబుతున్న వేళ ..ఆయా పార్టీలు మౌనంగా ఉండడం మంచిదా కాదా అన్నది ఆలోచన చేయాలి. గట్టిగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఢల్లీిని కదిలించేలా రైతు ఉద్యమం తరహాలో ఉద్యమించాలి. ఐదు రాష్టాల్ర ఎన్నికల్లో ఈ సమస్యలను ప్రస్తావించాల్సి ఉన్నా.. స్థానిక సమస్యలపైనే పెద్దగా ఫోకస్ పెట్టాయి విపక్షాలు. ప్రైవేటీకరణ, ప్రభుత్వ సంస్థల అమ్మకం సరైనదేనా అన్న చర్చ చేయలేదు. ఒకవేళ నిరుద్యోగం తదితర అంశాలు ప్రస్తావించినా పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు.
ప్రజలముందు చర్చకు పెట్టాల్సిన బాధ్యతల నుంచి విపక్షాలు తప్పుకుంటున్నాయి. భావోద్వేగంతో మాట్లాడం ప్రధాని మోడీకి అత్యంత సహజమైన విద్య కావడంతో ఆయన ఈ అంశాల జోలికి పోకుండా ఇతర అంశాలను ప్రస్తావించి ముందుకు సాగారు. ఆయన భావోద్వేగాలతో ప్రకటనలు చేస్తారు. ప్రజలను, ప్రతిపక్షాలను సెంటిమెంట్‌తో కొడతారు. భావోద్వేగంతో మాట్లాడారు. తాను జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చానని, ఓ చాయ్‌వాలానని అంటారు. పార్టీ కార్యకర్త నుంచి ప్రధాన మంత్రి వరకూ రావడానికి మధ్య ఎన్ని ముళ్ల దారుల్ని అధిగమించానో చెబుతారు. తనకు వెనకాముందూ ఎవరూ లేరని అంటారు.. అలాగని ప్రజలకు ఉపయోగపడే పనులకన్నా…కార్పోరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే పనులే ఎక్కువగా చేస్తారు. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నమ్మకూడదని, గతంలో కూడా వాజపేయి హయాంలో ఇలాంటి ప్రచారం చేశారని పదేపదే చెప్పడం ద్వారా రైతుల ఆందోళనలో అర్థం లేదని వాదిస్తూ వచ్చారు. కానీ రైతులు గట్టిగా పోరాడడంతో సాగుచట్టాలనఉ వెనక్కి తీసుకున్నారు.
ప్రధానమంత్రి ఉపన్యాసాలు తరుచూ వినే వారందరికీ ఆయన భావోద్వేగాలు తెలుస్తాయి. ఆయన ఎప్పుడు ఎలా ఎవరిని బుట్టలో వేయాలో అలా వేస్తారు. కాంగ్రెస్ నేతలను సైతం బుట్టలో వేసుకోగలరు. గులాంనబీ ఆజాద్ లాటి వారిని కూడా కంటతడిపెట్టించేలా మాట్లాడారు. దీనికి తోడు విపక్షం బలహీ నంగా ఉండడం మోడీకి కలసి వస్తోంది. ప్రధానమంత్రి మోడీకి ఎక్కడ స్వరం తగ్గగించాలో.. ఎక్కడ పెంచాలో ..ఎక్కడ సెంటిమెంట్ వాడుకోవాలో బాగా తెలుసు. అలాగే ఏ అంశంపై ఎక్కడ ఆవేశంగా మాట్లాడాలో కూడా తెలుసు.
భారతీయుల, ప్రతిపక్షాల వీక్‌నెస్ బాగా ఎరిగి మాట్లాడుతారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ము తానని అంటున్నా ఏ ఒక్కరూ వ్యతిరేకించి రోడ్డెక్కడంలేదు. ఆందోళ నలు ఆయా ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. పార్టీలో ఓ కార్యకర్తగా కలిసిపోయి చాలా ఆత్మీయంగా మాట్లాడుతారు. వ్యవసాయ, కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టినందుకు, అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందుకు కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కొన్నందుకు ప్రపంచమంతా హర్షిస్తుందని చాటుకున్నారు.
ఇలా మోడీ మాయలో పడ్డారా లేక…తమ లొసుగులు ఎక్కడ బయటపడతాయా అన్నది తెలియదుగానీ ప్రస్తుతం దేశంలో అనేకానేక సమస్యలపై విపక్షాలు పోరాడలేక చేవచచ్చి పోయాయి. వీరంతా ఐక్యత సాధిస్తారని అనుకుంటే ప్రజలు మోసపోవడం తప్ప మరోటి కాదు. ప్రజల సమస్యలపై పోరాడలేని విపక్షాలు రేపు ప్రజల పక్షాన పోరాడుతారన్న భరోసా ఉంటుందా అన్నది ఆలోచించాలి. ఇక సొంతపార్టీ బిజెపిలో అయితే గతంలో ఎప్పుడూ లేనంత నిశ్శబ్దం అవరించింది. ఎవరు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్,గడ్కరీ, ఇలా అందరూ ఎదరించ గలిగిన శక్తిని కోల్పోయారు.
అంతెందుకు ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా మాట్లాడడం లేదు. సాగు చట్టాలపై ఆర్డినెన్స్‌లను ప్రవేశ పెట్టినప్పుడు పార్టీలో అంతర్గతం గా కూడా చర్చించ లేదు. కార్మిక చట్టాల గురించి సందేహాలు ప్రకటించడంలేదు. నిత్యావసర వస్తువులు, పెట్రోలు ధరలు ఆకాశానికి అంటినా ఎవరూ చర్చించే ప్రయత్నం చేయడంలేదు. ప్రభుత్వ ఆర్థిక విధానా లగురించి కానీ, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి కానీ అడిగే ధైర్యం చూపడంలేదు.
ఈ దేశం భవిష్యత్‌ను మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి రోజంతా తమ మధ్య ఉన్నా తమ మనసు ల్లో రేగుతున్న సందేహాలను తీర్చుకునే ప్రయత్నం ఎవరూ చేయడంలేదు. ఇటు బిజెపిలో ఎవరూ చర్చించ కుండా..అటు విపక్షాలు మాట్లాడకుండా ఉండడం కారణంగా ప్రధాని మోడీకి కాలం కలసి వస్తోంది. అందుకే అనుకున్న పనిని మెల్లగా పూర్తి చేస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడినా ప్రజల్లో పెద్దగా స్పందన రావడం లేదు.
కమ్యూనిస్టులు కరపత్రాలకు కూడా పనికి రాకుండా పోయారు. బిజెపిలో ప్రస్తుత నేతలంతా తమ రాజకీయ భవిష్యత్‌ను చూసుకుంటారే తప్ప మోదీ, అమిత్ షా నిర్ణయాలను ప్రశ్నించి, లేదా కనీసం చర్చించి వివాదాస్పదం కావాలని కోరుకోవడం లేదు. అందుకే ఐదు రాష్టాల్ల్రో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మోడీ మాత్రమే ధీమాగా ఉన్నారు. కరోనా బాధతలో ప్రజలు కూడా బతుకుదెరువు వేటలో ఉన్నారు. కాంగ్రెస్ గతంలో అవలంబించిన సంస్కృతికీ, బిజెపిలో ప్రస్తుత సంస్కృతికీ పెద్ద తేడా కనిపించడంలేదు.