Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దక్షిణ కాశీగా మేళ్లచెరువు శివాలయం

 

-1 నుంచి 5 వరకు మహాశివరాత్రి జాతర.

– జాతరకు సర్వం సన్నద్ధం.

-అధిక సంఖ్యలో తరలిరానున్న భక్తులు.

-ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు.

మేళ్లచెరువు ఫిబ్రవరి 27 ( నిజం న్యూస్ ). మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మార్చి ఒకటి నుండి 5 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి  నల్లగొండ జిల్లాలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయం కాకతీయుల కాలం నాటి నుంచి నేటి వరకు అశేష భక్తులు పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందింది.

శివలింగం ప్రత్యేకత……… ఇక్కడ శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది దేవాలయంలో చుట్టూ పక్కల సుమారు 300 అడుగులకు పైగా తవ్విన నీరు పడని పరిస్థితులలో ఈ శివలింగం లో నీరు ఉండటం విశేషం శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విధంగా పంచభూత తత్వము గల ఈ శివలింగం తల భాగం వరకు జలముచే నిండి ఉంటుంది ఈ శివలింగం నుంచి నీటిని ఎంత తీస్తే మళ్ళీ అంతా నీరు ఊరుతుంది. దానికి పైకి రాదు.

ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతీ పుష్కరానికి ఈ శివలింగం ఒక ఇంచ్ మందం పెరుగుతూ ఉండటం విశేషం. పెరగనున్న భక్తుల తాకిడి మహాశివరాత్రి సందర్భంగా ఈసారి జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని సంబంధిత అధికారులు అంచనాలు వేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయశాఖ, రెవిన్యూ, ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ, పోలీస్ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రధాన రహదారిపై వాహనాలను నిలుపుదల లేకుండా చర్యలు , పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు దేవాలయ ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు క్యూ పద్ధతిలో స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లతో పాటు దేవాలయ ప్రాంగణం చుట్టూ పక్కల ప్రైవేటు వాహనాలు అనుమతులు లేకుండా కేవలం కాలినడకన ద్వారానే భక్తులు దేవాలయానికి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు జాతర సందర్భంగా మేళ్లచెరువు లో ఎద్దుల పంద్యాలు, కబడి వంటి ఇతరత్రా క్రీడా పోటీలు నిర్వహించడం, సాంఘిక, పౌరాణిక, జానపద నాటికలు డ్రామాలు వేయడం ఇక్కడ ఆయన ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యేక బస్సు సౌకర్యాలు మేళ్లచెరువు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యార్థం కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, జగ్గయ్యపేట, నుంచి కోదాడ హుజూర్నగర్ మీదుగా మేళ్లచెరువు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే సంబంధిత డిపో మేనేజర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి.