పిల్లలతో కాలువలో దూకిన తల్లి

పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి

నందిపేట్, ఫ్రిబ్రవరి 28, (నిజం న్యూస్):నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రం లో విషాదం చోటు చేసుకుంది గుత్ప కెనాల్ లోకి తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి దుకి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో అటుగా వచ్చిన నందిపేట్ కానిస్టేబుల్ రాకేష్ తల్లిని కాపాడారు. అయితే ఆరు నెలల బాబు, రెండు సంవత్సరాల కూతురు గల్లంతయ్యారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాల కారణంగానే నందిపేట్ మండల కేంద్రానికి చెందిన తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. స్థానిక పోలిసులు గజ ఈతగాళ్ళు సాయంతో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు