మాటేడు ఆలయ భూములను కాపాడాలి

మహబూబాబాద్ తొర్రూర్ ఫిబ్రవరి 28(నిజం న్యూస్)

తొర్రూరు మండలంలోని మాటేడు రామలింగేశ్వర స్వామి ఆలయ భూములను పరిరక్షించాలని,అన్యాక్రాంతం అయిన ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖ కు అప్పగించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తొర్రూర్ లో బిజెపి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన మాటేడు రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది అని తెలిపారు.ఆలయ ధూపదీప నైవేద్యాల కోసం,ఆలయ అభివృద్ధికి ఆనాడు వందల ఎకరాల భూమిని దానం చేస్తే దాన్ని అక్రమంగా ఆక్రమించింది ఆలయ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ అధికార టీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు.దేవాలయ భూములను సర్వే చేసి అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్ళిన అధికారులపై అధికార పార్టీ నేతలు రాళ్ళ దాడికి పాల్పడి వారిని భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యం చేసి ఆలయ భూముల ను ఖాళీ చేయకుండా గుండాగిరి చేయడం తగదని అన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాటేడు రామలింగేశ్వర స్వామి ఆలయ భూములపై ప్రత్యేక చొరవ చూపి అన్యాక్రాంతం అయిన ఆలయ భూములను పరిరక్షించాలని,ఆలయ భూములను ఆక్రమించి అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ద్రృష్టికి తీసుకెళ్ళి అన్యాక్రాంతం అయిన ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంత వరుకూ పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, జిల్లా నాయకులు రంగు రాములు,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, రచ్చ కుమార్, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, మంగళపళ్ళి యాకయ్య,సురేందర్ రెడ్డి,నూకల నవీన్,దాసరి మురళి తదితరులు పాల్గొన్నారు.