Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న నీచుడు జిల్లా అధ్యక్షుడు రేగా

– పినపాకలో గ్రూప్ రాజకీయాలు చేసేదే స్థానిక ఎమ్మెల్యే రేగా…
– తెలంగాణ ఉద్ద్యమ ద్రోహి ఎమ్మెల్యే రేగా…
– స్థానిక ఎమ్మెల్యేకు పిచ్చిలేసింది…ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లే టైం వచ్చింది…
– పొంగులేటితో పెట్టుకుంటే పోరిక ఇరుగుతుంది…
– మీడియా సమావేశంలో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు…

భద్రాద్రి ప్రతినిధి, ఫిబ్రవరి 27 (నిజం న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న ఒకే ఒక నీచుడు,దృష్టుడు
పినపాక సైతాన్ జిల్లా అధ్యక్షుడు,స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆదివారం మండలంలోని కిన్నెర కళ్యాణ మండపంలో డీసీసీబీ డైరెక్టర్ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు ప్రాంతంలో దళితులు అందరు కలిసి చందాలు వేసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకోసం ఆప్రాంత దళితులంత కలిసి దళితబిడ్డ రాష్ట్ర నాయకుడు పిడమర్తి రవిని ఆహ్వానించారు.ఈక్రమంలో పిడమర్తి రవి ఒక గొప్ప నాయకుడుని ముందు ఆవిష్కరించాలని తలంపుతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణకు పిలిచారు.

ఈవిషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు రెండు కిలో మీటర్ల దూరంలోనే పిడమర్తి రవిని,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొంతమంది నాయకులను స్థానిక పోలీసులతో కలిసి అడ్డుకున్నారు.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయనివ్వకుండా 144 సెక్షన్ అమలు చేశాడని ఆయన ఆరోపించారు.
ఆప్రాంత దళితులు అంత కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని పిడమర్తి రవి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో ఆవిష్కరించాలని చూస్తే ఆవిగ్రహాన్ని అడ్డుకోవాల్సిన అంత అవసరం జిల్లా అధ్యక్షుడికి ఏముందని ప్రశ్నించారు.ఈలోగా పిడమర్తి రవి దళితులతో కలిసి జై..భీమ్..జై..భీమ్ అంటూ అంబేద్కర్ విగాహన్ని ఆవిష్కరించారని ఆయన తెలిపారు.

విగ్రహ ఆవిష్కరణలో మండలంలోని ఒక నాయకుడుతో కలిసి గుండాలను ఏర్పాటు చేసి,గొడవలు,అంబేద్కర్ సాక్షిగా రక్తపాతం చేసిన నీచుడు,దృష్టుడు స్థానిక ఎమ్మెల్యే రేగా అని మండిపడ్డారు.పినపాకలో గ్రూప్ రాజకీయాలు చేసేదే స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు అని చెప్పుకొచ్చారు.తెలంగాణ సాధనలోగాని,తెలంగాణ ఉద్ద్యమంలోగాని రేగా కాంతారావు ఎప్పుడైనా పాల్గొన్నాడా అని ఘాటుగా విమర్శించారు.తెలంగాణఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో తమవంతు పాత్ర నిర్వహించిన పిడమర్తి రవి తెలంగాణ నేతగా ఎంతో గుర్తింపు ఉందన్నారు.అలాంటి వ్యక్తి పిడమర్తి రవిపై రాళ్లతో దాడులు చేపిస్తారా అంటు ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్ద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో పోటీ చేసి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ పార్టీ లోకి వచ్చి ఈనాడు దళితబిడ్డలను అడ్డం పెట్టికొని చిల్లర..చిల్లర వేషాలు వేస్తున్నాడని విమర్శించారు.రేగా కాంతారావు ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవసరం కోసం ఆయన ఇంటి ముందు కాపలా కాసిన రోజులు మర్చిపోయాడా అంటూ ధ్వజమెత్తారు.ఈనాడు పదవి మదంతో, మద్యం మత్తులో సోషల్ మీడియాలో పొంగులేటిపై చిల్లరగా పోస్టులు పెట్టి చిల్లర…చిల్లర నాయకుడిగా మారాడని దుయ్యబట్టారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పినపాక ఎందుకు వచ్చావ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంత దమ్ము ఉందా అని ప్రశ్నించారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పెట్టుకుంటే పోరిక ఇరుగుతుందని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

స్థానిక ఎమ్మెల్యేకు పిచ్చిలేసిందని..ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లే టైం వచ్చిందని ఈసందర్భంగా
అనకొచ్చారు.ఈపిచ్చిలోనే టిఆర్ఎస్ పార్టీలో వర్గా విబేధాలు ఏర్పాటు చేస్తున్నాడని ఆయన
చెప్పుకొచ్చారు.ఈపిచ్చిలో ఊగుతూ..జిల్లా పదవి వ్యామోహంతో ప్రజా ప్రతినిధులను ఎవరిని బడితే వారిని పార్టీ నుంచి బహిష్కరణ చేస్తున్నాడని తెలిపారు.రేగా కాంతారావు భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని దందాలు,కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు.వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలందరికి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు వొళ్ళు దెగ్గర పెట్టుకొని అందరిని కలుపుకొని పోయి పార్టీ కోసం పని చేయాలని చెప్పారన్నారని ఆయన తెలిపారు.

కానీ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మాటలు లెక్క చేయకుండా,అందరిని కలుపుకోకుండా వర్గ రాజకీయం చేస్తున్నాడని ఈసందర్భంగా అనకొచ్చారు.పార్టీ ఏమైనా నీ.. అయ్యా జగిరా..
నీ తాత జగిరా అని ఘాటుగా ప్రశ్నించారు.
ఈలాంటి నీచుడు,దృష్టుడు సంగతి సీఎం కేసిఆర్ ముందు తేల్చుతామని ఘాటుగా హెచ్చరించారు.ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు,నాయకులు కీసర సుధాకర్ రెడ్డి,కటుకురి శ్రీనివాస్,తమ్మిశెట్టి సాంబ,ఉపసర్పంచ్ వెంకట్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.