ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

విద్యార్థుల ముఖంలో ఆనందం వెల్లివిరిసిన వేళ.

హైదరాబాద్, ఫిబ్రవరి 27 నిజం న్యూస్

ఉక్రెయిన్ నుండి భారత్ దేశం చేరుకున్న తెలంగాణ విద్యార్థులు, ఆదివారం రోజున తెలంగాణ సీఎంవో, ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ అధికారులు మరియు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ వారిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం చేరుకోగానే విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏది ఏమైనా ఉక్రెయిన్ లో గంట గంట నరకం అనుభవించా మనీ పేర్కొంటూ, యుద్ధ సమయంలో భారత దేశ ప్రజల కోసం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, శిరస్సు వంచి నమస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభినందనలు విద్యార్థులు తెలిపారు.