మైనార్టీ కుటుంబానికి జగదీషుడి ఆపన్న హస్తం

సూర్యాపేట పట్టణంలో 44వ వార్డు కి చెందిన షేక్ .నజీర్ పాష గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో నజీర్ పాష కుటుంబ సభ్యులు స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి గారు 1,00,000( ఒక లక్ష రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ *( LOC ) ద్వారా మంజూరు చేపించి వారి కుటుంబానికి అండగా నిలిచారు…
ఈ సందర్భంగా నజీర్ పాష కుటుంబసభ్యులు మాట్లాడుతూ
ప్రజల కష్టాల్లో దుఃఖంలో పాలు పంచుకునే నాయకుడు సూర్యాపేట శాసనసభ్యులు గా దొరకడం మా అదృష్టం అని అన్నారు.
మాకు ఏ బాధ వచ్చిన, ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు