మేము పెట్టేది తినాలి.. మెనూతో సంబంధంలేదు

మేము పెట్టేది తినాలి…….. మెనూ సంబంధంలేదు
-మధ్యాహ్న భోజన నిర్వాహకులపై విద్యార్థులు ఫిర్యాదు
-మెనూ పాటించాలని అడిగిన ఉపాధ్యాయులు…. -వల్ల కాదంటూ వంట గది తాళాలు వేసిన నిర్వాహకులు
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధక ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మిడ్ డే మీల్స్ (మధ్యాహ్న భోజనం)కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కానీ కొంత మంది మధ్యాహ్న భోజన నిర్వాహకుల నిర్లక్ష్యంతో పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి మేళ్లచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.మెనూ పాటించాలని అడిగిన ఉపాధ్యాయులకు సైతం నిర్వాహకులు మేము పెట్టిందే తినాలి మాకు మెనూ తో సంబంధం లేదు .
*విధులకు రాని వంట మాస్టర్..
రుచికర వంటలు వండి విద్యార్థుల కు పెట్టాల్సిన వంట మాష్టర్ తన విధులకు గత కొంతకాలంగా విధులకు రాకపోవడంతో 200 మంది విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
ఉపాధ్యాయులే వంట మాష్టార్లు అయిన వేళ..
వంట మాష్టర్ తన విధులకు రాకపోవడంతో ఉపాధ్యాయులే వంట మాష్టర్లు గా మారి మధ్యాహ్నం భోజనం వండి మరీ వడ్డిస్తున్నారు. ఒక పక్కా క్లాసులు మరో పక్కా వంట చేయడం ఇబ్బందిగా ఉన్న విద్యార్థులు పస్తులుండడం ఇష్టం లేక ఉపాధ్యాయలు వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు.
మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వంట గదులకు తాళాలు వేసి వెళ్లిపోవడంతో టెంట్, సామానులు తెచ్చి మెనూ ప్రకారం పిల్లలకు తమ వంతుగా భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం బాగా లేదంటే మమ్మల్ని టార్గెట్ చేస్తుంది………. వంశీకృష్ణ టెన్త్ క్లాస్ విద్యార్థి వంటమాస్టర్ ను మధ్యాహ్నం భోజనం బాగాలేదు అని అడిగితే మమ్మల్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో తిట్లదండకం మొదలు పెడుతుందని ఆమె దగ్గరికి పోవాలంటే నాకు భయం గా ఉంటుందని అన్నారు.
నజీర్ ఆరవ తరగతి విద్యార్థి. నీళ్ల చారు తో అన్నం.
మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టకుండా వారికి ఇష్టం వచ్చిన రీతిలో వారు అన్నం పెడుతున్నారని , కూరలు అన్నం ఏది కూడా బాగుండటం లేదని చెప్తున్నారు.
పై అధికారులకు ఫిర్యాదు చేశాం… ప్రధానోపాధ్యాయుడు నారపరెడ్డి. మధ్యాహ్న భోజనం నిర్వహణ దారులపై పై అధికారులకు ఫిర్యాదు చేశామని ప్రధానోపాధ్యాయుడు నారపరెడ్డి తెలిపారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ఎన్నిసార్లు మందలించిన ఉపయోగం లేదని తెలిపారు