రెండు నెలల తర్వాత శవమై తేలాడు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి కి చెందిన చింతల కట్ట మైసయ్య వయస్సు 65 సంవత్సరాలు వృద్ధుడు గత రెండు నెలల నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం రాయగిరి చెందిన గొర్రెల కాపరి గోర్లు తప్పి పోవడం తో ఉదయం రాయగిరి రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న మల్లన్న టెంపుల్ ఎదురుగా ఉన్న గుట్టలో వెతుకుతూ ఉండగా గుర్తు తెలియని మృతదేహం ఆయనకు కనిపించింది. వెంటనే గమనించి చింతల కట్టమైసమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న వారు శవము చింతల కట్ట మైసమ్మ నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్య బృందంతో పరిశీలించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పానున్నారు.. స్థానికుల వివరాల ప్రకారం మైసయ్య అటుగా నడుచుకుంటూ వెళుతూ పడి ఉంటారని ఎవరు గమనించక పోవడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని తెలిపారు.