గోదావరి ఇసుక ర్యాంపు వద్ద ట్రంచ్ కొట్టినా ఆగని అక్రమ ఇసుక రవాణా

భద్రాచలం గోదావరి ఇసుక ర్యాంపు వద్ద ట్రంచ్ కొట్టినా ఆగని అక్రమ ఇసుక రవాణా….

 

భద్రాచలం ఫిబ్రవరి 26 (నిజం న్యూస్ )భద్రాచలంలోని ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తోల కాలు జరుగుతున్నాయని తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ ట్రెంచ్ కొట్టించినప్పటికి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు.

రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణాదారులు ఇసుక ర్యాంపు సమీపంలో గోదావరి నుంచి దారిని ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టణంలోని కొన్ని ఏరియాలలో డంపు చేస్తున్నారు.

డంపు చేసిన ఇసుకను పగటిపూట ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న 2 ట్రాక్టర్లను శనివారం తెల్లవారుజామున భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. శాంతి నగర్, జగదీష్ కాలనీలలో అక్రమంగా గోదావరి నుంచి తోలి, డంపు చేసిన సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను భద్రాచలం తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ స్వాధీనం చేసుకున్నారు.