ఆవిష్కరణలు, స్టార్టప్ లకు టిఎస్ఐసి ఆర్థిక సహకారం

గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్ లకు టిఎస్ఐసి ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం నేడొక ప్రకటనలో తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్స్ (TSIRII) ద్వారా ఆర్థిక సహకారం అందించడానికి ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ ఐ.టి & సి. విభాగం జూలై 2021న GO జారీచేసిందని, నోడల్ ఏజెన్సీగా టిఎస్ఐసి వ్యవహరించనున్నట్లు, TSIRII ద్వారా, ప్రోత్సాహకాల కోసం 30 లక్షల కార్పస్ ఫండ్ కేటాయించబడిందని తెలిపారు.
వివిధ దశల్లో ఉన్న ఆవిష్కరణలు, స్టార్టప్ లు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం అనేక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని, వీరికి ఆర్థిక చేయూత అందించి ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో దీనిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొంది ఉన్న ఆవిష్కరణ, స్టార్టప్ లు లేదా పూర్తిగా రాష్ట్రంలోనే అభివృద్ధి చేయబడ్డ ఆవిష్కరణలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, పూర్తి వివరాల కోసం https://teamtsic.telangana.gov.in/tsiri-incentives/ లో చూడవచ్చునని తెలిపారు.
స్వీకరించబడిన దరఖాస్తులను TSIC స్థాపించిన గ్రాస్‌రూట్ అడ్వైజరీ కౌన్సిల్ పరిశీలించి నిధులు అందజేస్తుందని, అర్హత కలిగిన ఆవిష్కరణలు/స్టార్టప్‌లు https://teamtsic.telangana.gov.in/tsiri-incentives/ లో దరఖాస్తు చేయాలని కోరుతున్నట్లు ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.