అక్రమ ఇసుక రవాణా పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

*అక్రమ ఇసుక అనుమతులు రద్దు చేయాలి. రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ మందుల సామెల్*

 

*రైతుల పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నా పట్టించుకోరా*

 

*రాత్రి పగలు తేడా లేకుండా అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్నవారిపై పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.*

 

*ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులపై కేసులు ఎత్తివేయాలి*

 

*తిరుమలగిరి ఫిబ్రవరి 26 నిజం న్యూస్*

ముఖ్యమంత్రి కేసీఆర్ ర్తెతుల సాగు భూములకు నీటిని అందించాలనే సదుద్దేశంతో బిక్కేరు-మూసీ ,వాగులలో భూగర్భజలాలు పెంచేలా చెక్ డ్యాం లు నిర్మాణం చేస్తుంటే ,మరోపక్క ప్రాజెక్టులపేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం జానకిపురం, చిర్ర గూడూరు గ్రామాలలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారంటూ రాష్ట్ర గిడ్డంగుల మాజీ చ్తెర్మన్ మందుల సామేలు ఆరోపించారు.

ధర్మారం గ్రామం లోని చెక్ డ్యాం పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ..

రాత్రి పగలు తేడా లేకుండా అధిక లోడుతో నిత్యం 100లాధి లారిలలో బస్వాపూర్ పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తూ హైదరాబాదులో విక్రయిస్తూ లక్షలు గడిస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు .

.అక్రమ ఇసుక రవాణా ప్తె ర్తెతుల అభిప్రాయం సేకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిర్యాదు చేస్తామన్నారు. ఈ ఇసుక రవాణా ప్రభుత్వం చేస్తుందని కొందరు నిందలు మోపుతున్నారు

ఇది ప్రభుత్వానికి సంబంధం లేని అక్రమ ఇసుక రవాణా అని అన్నారు.

.దీని వెనుకాలో ఎవరెవరు ఉన్నా వారు ఎంతటి వారైనా గుర్తించి అక్రమ ఇసుక రవాణా ను అరికట్టడానికి కృషి చేస్తానని అన్నారు.

పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని ఇసుక రవాణా అడ్డకున్న రైతులపై కాంట్రాక్టర్లు కేసులు పెట్టడం సరైనది కాదని వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఇది ఇలాగే కొనసాగితే వేల ఎకరాల పంట పొలాలు నీరు లేక ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఇలాంటి దుస్థితి రాకముందే బిక్కేరు వాగును కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు .

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకొని వారి

ఇసుక అనుమతులు రద్దు చేసి బికే రు వాగు పరివాహక ప్రాంతాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు