రెడ్లవాడలో కార్డన్ సెర్చ్
– సిఐ హథిరామ్
ప్రాణ,ఆస్తి రక్షణకై తనిఖీ-ఎస్ఐ సీమ ఫరేహిన్
నెక్కొండ ఫిబ్రవరి25(నిజం న్యూస్):
నెక్కొండ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన హథీరామ్ మొట్టమొదటిసారిగా రెడ్ల వాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు.దీనిలో అక్రమంగా తరలిస్తున్నా 40 వేల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు,మరియు అనుమతి పత్రాల్లేని 30 వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు.గుడుంబా,గుట్కా
,గంజాయి,విక్రయాలను సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హాథిరామ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నెక్కొండ చెన్నారావుపేట నర్సంపేట ఖానాపూర్ నల్లబెల్లి దుగ్గొండి పోలీసులు నర్సంపేట సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ కై నిర్వహించే ఈ తనిఖీలతో పోలీసులపై ప్రజలకు విశ్వాసం తోపాటు చట్టం పై గౌరవం బాధ్యత కలిగి ఉంటారని ప్రతి పౌరుడు బాధ్యతగా మెలుగు తారని సీఐ హథీ రామ్ అన్నారు.