అంబేద్కర్ విగ్రహాఆవిష్కరణలో వర్గపోరు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాఆవిష్కరణలో వర్గపోరు
అశ్వాపురం ప్రతినిధి ఫిబ్రవరి 24
(నిజం న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామంలొ యస్.సి వర్గం వారి సమక్షంలో డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నూతనంగా నిర్మించారు. ఈ విగ్రహం ఆవిష్కరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రతొలి యస్.సి కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్. పిడమర్తి రవిని మల్లెలమడుగు యస్.సి గ్రామ కమిటీ ఆహ్వానించారు కాగా మండల టి.ఆర్.యస్ పార్టీ వారు రెండువర్గాలుగా మారి ఆవిష్కరణ లో అల్లర్లు సృష్టిస్తున్న తరుణంలో కలెక్టర్ ఆదేశానుసారం గా మండల రెవిన్యూ అధికారి సమక్షంలో పోలీసులు వారు 144 సెక్షన్ అమలు చేసి ఆవిష్కరణ ఆపివేశారు ఇరువర్గాల వారికి అల్లర్లు చేయరాదని గంపులుగా ప్రజలు ఉండకూడదని ఆదేశించారు. దీనిపై స్థానిక ప్రజలు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఇంతటి అవమానాన్ని జీర్ణించుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ఇరువర్గాలు నినాదాలతో హోరెత్తుతున్న సమయంలో యస్.సి.నాయకుడు రావులపల్లి నరసింహ రావు సమక్షంలో యస్.సి. రాష్ట్ర తొలి చైర్మన్ పిడమర్తి రవి విగ్రహాఁ ఆవిష్కరించారు పూలమాలలు వేశారు దీ నీతో ఇరువర్గాలు రాళ్లు కర్రలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మంద సైదులు అనే వ్యక్తికి తల పగలడం జరిగింది వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తరువాత రేగా వర్గం వారు మండల టి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు అమరేంధర్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు దీ నీతో పోలీసులు చివరిగా కలుగజేసుకొని ఇరువర్గాల వారిని తరిమి కొట్టారు.