క్షేమంగానే ఉన్నాను…..భయంగా ఉంది

క్షేమంగానే ఉన్నాను…..భయంగా ఉంది
ఆత్మకూర్ ఎస్ ఫిబ్రవరి 25(నిజం న్యూస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నిమ్మికల్ గ్రామానికి చెందిన బీరవెల్లి వెంకట్ రెడ్డి రేణుక దంపతులకు ఇద్దరు సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది.కుమారుడు బీరవల్లి సంపత్ రెడ్డి ఉక్రెయిలోని జపోరిజియా యూనివర్సిటీలో ఎం బి బి ఎస్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో స్వగ్రామమైన నిమికల్ కు వచ్చి 7 నెలల క్రితం తిరిగి జపోరిజియా తిరిగి వెళ్ళాడు. గత వారం రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ విషయంపై సంపత్ రెడ్డి తల్లిదండ్రులు వీడియో కాల్ చేసి సంపత్ రెడ్డి తో మాట్లాడారు. తాను చదువుతున్న యూనివర్సిటీలో ఎలాంటి యుద్ధ వాతావరణం లేదని, ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి యూనివర్సిటీకి రావడానికి 8 గంటల సమయం పడుతుందని ఆయన అన్నారు. తమ యూనివర్సిటీ పడమర దిక్కున ఉందని యుద్ధం తూర్పు దిక్కున కొనసాగుతున్నదని అయినప్పటికీ భయంగా ఉందని, వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రతిరోజు తన కుమారుడు సంపత్ రెడ్డి యోగక్షేమాలను వీడియో ఫోన్ కాల్ ద్వారా అడిగి చేసుకుంటున్నామని ఉక్రెయిన్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిందని ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఆగి, చరవాణి సిగ్నల్ నిలిచిపోతే పరిస్థితి ఏమిటని అర్థం కాక సంపత్ రెడ్డి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుని ఇండియా కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.