సేవ రత్న అవార్డు గ్రహీత పోలా వాణి కోటేశ్వరరావు

సేవ రత్న అవార్డు గ్రహీత పోలా వాణి కోటేశ్వరరావు ఎంపిక పట్ల సర్వత్రా హర్షం!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్  చేతులమీదుగా సేవ రత్న అవార్డు స్వీకరణ.

హైదరాబాద్ ,ఫిబ్రవరి 25, నిజం న్యూస్

ఆర్యవైశ్య సూర్యాపేట గడ్డ ,ముద్దుబిడ్డ, పి ఆర్ కె ఫౌండేషన్ చైర్మన్ పోలా. వాణి కోటేశ్వరరావు లు సమాజంలో పేదలకు తమ ఫౌండేషన్ ద్వారా విశిష్ట సేవలందించిన గాను శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతులమీదుగా సేవా రత్న అవార్డును పొందినట్లు పి ఆర్ కె. ఫౌండేషన్ చైర్మన్, వాణి కోటేశ్వరరావు లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నిజం న్యూస్ తో ముచ్చటిస్తూ , కరుణ మహమ్మారి లో ఎంతో మంది పేదలకు తమ ఫౌండేషన్ ద్వారా మాస్కులు, బట్టలు, నిత్యావసర సరుకులు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఏది ఏమైనా సేవ రత్న అవార్డు కు ఎంపిక కావడం అభినందనీయమని, ఫౌండేషన్ సభ్యులు, ఆర్య వైశ్యులు, ఐవిఎఫ్ సభ్యులు, మిత్రులు ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు