ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన యాదగిరిగుట్ట యువకులు
ఉక్రెయిన్ చిక్కుకుపోయిన ఇద్దరు యువకులు….
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 (నిజం న్యూస్)
యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు యువకులు మూడేళ్ళ క్రితం ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుకోసం వెళ్ళగా ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి వచ్చే ప్రయత్నం చేసి అక్కడే చిక్కుకు పోయారు. యాదగిరిగుట్టకు చెందిన గంజి భానుప్రసాద్, శేషఫణిచంద్రలు మెడిసిన్ చదువుకోసం మూడేళ్ళ క్రితం యాదగిరిగుట్ట నుండి ఉక్రెయిన్ కు వెళ్లారు. యుద్ధం జరుగుతున్న సమయంలో తిరిగి ఇండియా వచ్చేందుకు అక్కడి కీవ్ ఎయిర్ పోర్ట్ కు రాగా అప్పటికే ఎయిర్ పోర్ట్ ను రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో చేసేదేమీ లేక తిరిగి జూఫ్రోజీ కాలేజీకి ఇద్దరు విద్యార్థులు తిరిగి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈవిషయం తెలిసిన వెంటనే ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఎప్పటికప్పుడు సమాచారం. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.