మేకల దొంగతనానికి వచ్చి మహిళను హత్య
ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 నిజం న్యూస్
ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద జాన్ బీ అనే వృద్ధురాలి హత్య. మేకల దొంగతనానికి వచ్చి హత్య చేసిన యువకుడు.
ఖమ్మం జిల్లా రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కన జాన్ బీ అనే వృద్ధురాలు గుడిసె వేసుకొని నివాసం ఉంటుంది . ఆమె మేకలు కాసుకొని జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ వ్యక్తి మేకల దొంగతనానికి పాల్పడగా అది చూసిన జాన్ బీ ఆయనను ప్రతి గటించే ప్రయత్నం లో చాకు తో ఆమె పై హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇది గమనించిన చుట్టూ పక్కల వాళ్లు ఆ వ్యక్తి ని పట్టుకోని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.