ఫైర్ ఇంజన్ సాయంతో మహా లింగం శుభ్రం
ఫైర్ ఇంజన్ సాయంతో మహా లింగం శుభ్రం……
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25(నిజం న్యూస్)
రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ శివ శంకర పార్వతీ దేవాలయం మరియు నలభై ఆరు అడుగుల మహా శివలింగంలను యాదాద్రి జిల్లా అగ్నిమాపక శాఖ వారి ఫైర్ ఇంజన్ ద్వారా నీటిచే శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఈ నెల 27,28 మార్చి ఒకటో తేదీలలో జరుగును.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బింగి శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ ఎస్సై శ్రీనివాస్, మరియు సిబ్బంది,గ్రామ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు, యువకులు మాజీ సర్పంచ్, బడే ఎల్లయ్య,బండపల్లి రఘు,కోట ఎల్లయ్య,కాకారం. తిరుపతిరెడ్డి, గుమ్ముల. ప్రభాకర్,నంగునూరి వెంకటేశం, గణపురం శ్రీకాంత్, గుంటి కర్ణాకర్, గుంటి బిక్షపతి, ఆలయ పూజారి పాల్గొన్నారు. సర్పంచ్ గారు ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.