శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం వెల్లడి

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం వెల్లడి…….
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23 (నిజం న్యూస్)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తులు వివిధ రూపంలో రూ. 10,16,826 రూపాయలు ఆదాయం వచ్చినట్లు బుధవారం ఆలయ అధికారి ఈవో గీతా రెడ్డి తెలిపారు. రూ. 100 టికెట్ల దర్శనం ద్వారా, విఐపి టిక్కెట్ల ద్వారా, వాహన పూజలు ద్వారా, నిత్యకైంకర్యాలు ద్వారా, సుప్రభాత సేవ ద్వారా, కొబ్బరికాయలు విక్రయాల ద్వారా, ప్రసాదాల విక్రయాల ద్వారా, అన్నదానం విరాళాల ద్వారా, టోల్ గేట్ ద్వారా, పాత గుట్ట ద్వారా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బుధవారం రూ. 10 లక్షల 16 వేల 826 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.