కష్టకాలంలో ఉన్న సబితకు ఆటో, డబుల్ బెడ్ రూం ఇళ్లు

కష్టకాలంలో సబిత కు పెదన్నలా అండగా నిలిచిన
– మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.!
మానవత్వం వెల్లివిరిసిన వేళలో, కుటుంబసభ్యులు ఆనంద హేల.
తుంగతుర్తి ,ఫిబ్రవరి 23 ,నిజం న్యూస్
శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సబిత గారి తండ్రి ఇటీవల మరణించడంతో కుటుంబ ఆర్ధిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా తను ఆటో నడుపుతూ తల్లికి ఆసరాగా వుంటూ, చదువుకొంటుంది సబిత కుటుంబ పరిస్థితి గురించి ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ కుటుంబానికి SC కార్పొరేషన్ నుండి ఆటో ను, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ , జిల్లా అధికారులకు ఆదేశించారు.
మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు సబిత గారి నివాసానికి వెళ్లి SC కార్పొరేషన్ నుంచి మంజూరు అయిన ఆటో ను అందించి, సబిత గారితో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం కోసం తన వంతుగా ₹2,00,000/- (రెండు లక్షల రూపాయలు) ఆర్థికసాయం ఆకుటుంబ సభ్యులకు అందజేశారు
విద్యార్థి సబిత పై చదువుల కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జెడ్పి చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు, శాలిగౌరారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకన్న గౌడ్. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.