వీధుల్లో గురుకుల విద్యార్థుల కోలాటాలు

రాజకీయ నాయకుని బెదిరింపులతో, వెంపటి ప్రభుత్వ పాఠశాల, గురుకుల విద్యార్థులు, వీధిలో పడ్డ వైనం.
తుంగతుర్తి, ఫిబ్రవరి 23 నిజం న్యూస్.
విశ్వసనీయ సమాచారం మేరకు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించవలసిన స్థానిక నాయకుడు ఏకంగా ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులను బెదిరించి, సు దూరంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను, సంత్ సేవాలాల్ జయంతి లో పాల్గొనే విధంగా ఉసిగొల్పి, సుమారు రెండు గంటలు ఎండలో ఆటపాటలతో, డాన్సులు వేస్తూ ఉండటంతో, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు చూడలేక గురుకులం సొసైటీ చైర్మన్ దృష్టికి పోగా, సొసైటీ చైర్మన్ తక్షణమే ఫోన్ చేసి, ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన తుంగతుర్తి, మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. జరిగిన సంఘటనపై సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర నాయక్, గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ ఏకంగా ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా తీసుకురావడం జరిగింది కానీ, ఈ దుస్థితి మండల విద్యాధికారి కి తెలుసో తెలియదో పాపం. తిరిగి ప్రిన్సిపాళ్లు వ్యాయామ ఉపాధ్యాయుల కి, ఫోన్ చేయడంతో దీనితో విద్యార్థులు, సంబంధిత సిబ్బంది పలాయనం చిత్తగించారు. ఏది ఏమైనా గురుకుల ప్రిన్సిపాల్ లు, వెంపటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నియమ ,నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. జరిగిన సంఘటనపై పాఠశాల, గురుకులాల ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపించాలని, ఫోన్ లో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరినట్లు సమాచారం…