సంత్ సేవాలాల్ భవనానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయిస్తా.

లంబాడి హక్కుల కోసం పోరాటం చేసింది సంత్ సేవాలాల్!
జడ్పీ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు, శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి ,ఫిబ్రవరి 23, నిజం న్యూస్
లంబాడి హక్కుల సాధన కోసం పోరాటం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ నేనని జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు
బుధవారం మండల కేంద్రంలో నియోజక నియోజకవర్గ స్థాయిలో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో సేవాలాల్ కమిటీ అధ్యక్షులు డిప్లమా నాయక్ ఆధ్వర్యంలో, సంత్ సేవాలాల్ 283 జయంతిని గిరిజనుల ఆధ్వర్యంలో, పాటలు పాడుతూ కోలాటం వేస్తూ ఘనంగా జయంతిని నిర్వహించారు. అనంతరం తుంగతుర్తి తాసిల్దార్ కార్యాలయంలో 77 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం పోరాటం చేసి, జూబ్లీహిల్స్ లో మసూచి వ్యాధి అరికట్టడంలో తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన ప్రయోజనాలు దృశ్య, తండాలను గ్రామ పంచాయతీ గా మార్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దీనికే తుంగతుర్తి లో అదనంగా 11 గిరిజన గ్రామపంచాయతీ ఏర్పాటు చేసుకోవడంతో, ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధిలో ముందు ఉన్నామని అన్నారు. నియోజకవర్గ గిరిజన ప్రయోజనాల దృష్ట్యా సంత్ సేవాలాల్ భవనానికి, కోటి రూపాయల నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన ఉన్నత విద్యలో రాణించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలని కోరారు. అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నంటి ఉండాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి కిరణ్ కుమార్, ఆర్ డి ఓ నాగేంద్ర కుమార్, తుంగతుర్తి తాసిల్దార్ రాంప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ పుష్ప, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్,, సమన్వయ సమితి జిల్లా చైర్మన్ ఎస్ సి ఎ, రజాక్, జిల్లా కోఆర్డినేటర్ కళ్లెట్ల పల్లి శోభన్ బాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాడికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్, గిరిజన సర్పంచులు నల్లు రాంచంద్రారెడ్డి, ఈరోజు, శారద మాన్సింగ్, యాకూబ్ నాయక్, వెంకన్న నాయక్, రాములు నాయక్, ఎంపీటీసీ ఆంబోతు నరేష్ గుండ గాని రాములు గౌడ్, పూర్ణ నాయక్, విజ్జు నాయక్, వివిధ మండలాల తాసిల్దార్ లో ,ప్రజా ప్రతినిధులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు