220 కిలోల గంజాయి పట్టివేత…

ఇద్దరు అరెస్ట్,

దుమ్ముగూడెం ఫిబ్రవరి 22(నిజం న్యూస్)దుమ్ముగూడెం మండలం చిన నల్లబెల్లి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం ఏ ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దుమ్ముగూడెం మండలం చిన నల్లబెల్లి ప్రధాన రహదారిపై దుమ్ముగూడెం ఎస్సై రవి కుమార్ ,సీఆర్పీఎఫ్ సిబ్బంది తో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుండి వస్తున్న నంబర్ లేని కారును అపగా కారు డ్రైవర్ కారు ఆపకుండా పరారీ కావడంతో ఎస్సై కారును వెంబడించి అపి తనిఖీ చేయగా నాలుగు బ్యాగుల్లో రూ .45 లక్షల విలువ గల 220 కేజీల గంజాయి పట్టుబడింది.కారులో ఉన్న ఇద్దరి నిండుతులను అరెస్ట్ చేసి వివరాలు సేకరించగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నుండి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర కు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీ అయినట్లు అదుపులోకి తీసుకున్న ఇద్దరి నిండుతులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.