తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే

తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే!
ములుగు శాసనసభ్యులు. సీతక్క.
తుంగతుర్తి లో వివాహ వేడుక కు హాజరైన సీతక్క కు ఘన స్వాగతం.
బిజెపి, టిఆర్ఎస్, రెండు దొందూదొందే, కుట్రలను ప్రజలు నమ్మరు.
తుంగతుర్తి, ఫిబ్రవరి 21, నిజం న్యూస్
తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల, ప్రజలు ఆదరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నని… రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ములుగు శాసనసభ్యులు సీతక్క అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో పాల్వాయి నగేష్ వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. సమ్మక్క సారక్క దేవతల సాక్షిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం బిల్లును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ట ఉన్న మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుండా, వనదేవత లు రక్షించినట్లు తెలిపారు. దేశంలో మోడీ ప్రవేట్ పరం చేస్తూ, నిరుద్యోగ ను పెంచి పోషిస్తున్నారని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన చేస్తూ, నిరుద్యోగుల చావును చూస్తున్నారని విమర్శించారు. బిజెపి టిఆర్ఎస్ కుట్రలు పన్నుతూ, కాంగ్రెస్ పార్టీకి నష్టం పెద్ద మని చూస్తున్నారని కార్యకర్తలు నాయకులు వారి మల్లు నుంచి బయటకు రావాలని కోరారు. రాష్ట్రంలో 35 లక్షల సభ్యత్వ నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐకమత్యంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు దొంగ రీ. గోవర్ధన్ రావు, జిల్లా నాయకుల శ్రీనివాస్. పెండం రామ్మూర్తి ,అజయ్ కుమార్ ,రాంబాబు రమేష్ రామ్ చంద్రు, అన్నారం సర్పంచ్ అను కు, తదితరులు పాల్గొన్నారు…