పోచమ్మ తల్లి విగ్రహాం అపహారణ

 

ఎల్లారెడ్డిపేట, పిబ్రవరి 21,(నిజం న్యూస్):

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం లోని పురాతన పోచమ్మ తల్లి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.ఎల్లారెడ్డిపేట గ్రామం ఏర్పాటు చేసినప్పుడు రాయి చెట్టుకింద పురాతన పోచమ్మ తల్లి రాతి విగ్రహాన్ని అప్పటి కులపెద్దలు బైండ్ల పూజారులతో నెలకోల్పినట్టు ఆలయ సేవకురాలు కుమ్మరి అక్కపెల్లి ఎల్లవ్వ విలేకరులకు వివరించారు.శనివారం పొద్దంతా పూజలందుకున్న పోచమ్మ తల్లి రాతి విగ్రహాన్నీ ఏవరన్న మరోచోట మరో గ్రామంలో ప్రతిష్టించడానికన్న తీసుకపోయి ఉండవచ్చని లేకపోతే తల్లి వారిని ఇడిచిపెట్టబోదని ముష్కం వెంకట రాజం గౌడ్ అభిప్రాయ పడ్డారు. అకతాయిల పని కావచ్చునని వార్డుమెంబర్ పందిర్ల శ్రీ నివాస్ గౌడ్ అంటున్నారు.పోచమ్మ తల్లి పురాతన రాతి విగ్రహాంతో పాటు గుడిలో ఏవరో మొక్కలు చెల్లించుకోడానికి కట్టిన ముడుపు తొట్లేను సైతం శనివారం రాత్రి ఎత్తుకెళ్ళినట్టు ఎల్లవ్వ తెలిపింది.అప్పడప్పుడు రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ ఉదృతం చేయాలనీ ఎల్లారెడ్డిపేట గ్రామస్థులు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ని కోరుతున్నారు.