అడవుల్లో ప్రెషర్ మైన్స్ , బూబి ట్రాప్స్ అమర్చి ఆదివాసీల, మూగజీవుల ప్రాణాలు తీయడం సరైంది కాదు

-బి ఐ. బి అశోక్
చర్ల ఫిబ్రవరి 21 (నిజం న్యూస్) నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు దళ సభ్యులు తెలంగాణ సతీష్ గౌడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఆదివాసీలు నివసించే అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ప్రెషర్. మైన్స్ ను. బూబి ట్రాప్స్. అమర్చి అడవుల్లో ఆధారపడి జీవించే ఆదివాసీలను అరె పశువులను అడవుల్లో తిరక్కుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉందని అలాంటివి చేయడం సరైంది కాదని సిఐ. బి అశోక్ సోమవారం పత్రికా పత్రికా ప్రకటన లో తెలిపారు గత రెండు నెలల క్రితం మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అజాద్ మధు అరుణ రజితల ఆదేశాల మేరకు చర్ల మండలం ఢిల్లీ శాసన సభ్యులు ఎట్టి దేవా ( బాలు) మడకం ఎర్రయ్య (రాజేష్) అనే వ్యక్తులు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజలను భయపెట్టి సరిహద్దు ప్రాంతాల్లో ప్రెషర్. మైన్స్. బూబిట్రాప్స్. ఏర్పాటు చేశారని అన్నారు దీని కి ఆదివాసీల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రశ్నించే వారిని మాట్లాడవద్దని చంపుతామని బెదిరించి ఆదివాసీలను వంట చెరుకు కోసం పశువుల మేత కోసం అడవిలోనికి రావద్దని బెదిరించి ప్రెషర్ మైన్స్ .బూబిట్రాప్స్. అమర్చారని తెలిపారు అడవి సంపద విప్ప పూలు చీపురు తేనె వంటి అటవీ ఉత్పత్తుల పై ఆధారపడి జీవించే ఆదివాసీల ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోయిందని తెలిపారు. గత మూడు నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన మడకం దేవయాని ఆదివాసి కి చెందిన ఎద్దు కోటపాడు సరిహద్దు కూకరాజ్ గొట్ట సమీపంలో మేతకు వెళ్లి సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు అమర్చిన ప్రెషర్ మైన్స్ పేలడంతో తీవ్ర గాయాలయ్యాయని ఎద్దుకు కుడి కన్ను పూర్తిగా పోయిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్య సిబ్బందితో వైద్యం నిర్వహించి రూ 2000 ఆర్థిక సహాయంగా అందించామని తెలిపారు బత్తిని పల్లికి చెందిన ఆదివాసీ వ్యక్తి ఇంట్లో శుభకార్యం కొరకు పందిరి వేసేందుకు కర్రల కోసం అడవి కి వెళ్లి బత్తిని పెళ్లి . జట్ట పాడు సరిహద్దులు ఏర్పాటుచేసిన బూబిట్రాప్స్ గుంతలో పడి పశువులు కాలికి గుచ్చుకొని ప్రాణాయా పరిస్థితిలో వైద్య చికిత్స పొందుతున్నారని అన్నారు ఆదివాసి ప్రాణాలకు పశువుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యుల చర్యలను ఖండించాలని ఆదివాసి ప్రజలు సర్పంచులకు సంఘాలకు మానవహక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఇటువంటి ప్రజా అంతక నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులకు భయపడవద్దని గ్రామాల ప్రజలను బెదిరించి మావోయిస్టు సభ్యులకు పార్టీ నాయకులకు ఆశ్రమం ఇవ్వవద్దనిగ్రామాల నుండి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు