మత్తు పదార్ధాలకు బానిసలై భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకోవద్దు
మత్తు పదార్ధాలకు బానిసలు అయి బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకోవద్దు.
– డిఎస్పి వెంకటేశ్వర రావు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 21 (నిజం న్యూస్):
మత్తు పదార్ధాలకు విద్యార్థులు బానిసలు కావద్దని, బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకోవద్దని డి ఎస్ పి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లోని కె ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ వెంకటరమణ అధ్యక్షతన గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గంజాయి కొకైన్ , హెరాయిన్ , నల్ల మందు వంటి ఇతర వాటిని స్వీకరిస్తే కలిగే అనర్ధాలు పై అవగాహన కల్పించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినారు. ప్రిన్సిపాల్ వెంకట రమణ మాట్లాడుతూ యువత మత్తు లో తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని అన్నారు. మత్తు పదార్థాలను స్వీకరిస్తే జరిగే అనర్ధాల పై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మిర్యాలగూడ సి ఐ మండవ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకొ ట్రాఫిక్ సబ్ టెన్సెస్ చట్టాన్ని చేసిందని అన్నారు. మత్తు మందులు పండించే , వ్యాపారం చేసే వారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు అని అన్నారు . ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ లు శ్రీను నాయక్, శివ తేజ్ , ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు కోటయ్య , ఫ్రాన్సిస్, సునంద తదితరులు పాల్గొన్నారు