గిరిజన బిడ్డలను లాటరీ స్కీముల పేరుతో మోసం

*గిరిజన బిడ్డలను లాటరీ స్కీముల పేరుతో ఘరానా మోసం*

– అడవి బిడ్డలను లాటరీ స్కీములు మాయమాటలు.

– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన లాటరీ స్కీం బాధితులు.

ములకలపల్లి, ఫిబ్రవరి 21 (నిజం న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలోని దగ్గుపాటి సాయిబాబు దగ్గుపాటి సుజాత లాటరీ స్కీముల పేరుతో మోసాలు కొత్తగంగారం గ్రామం. పాత గంగారం పంచాయితీ, ములకలపల్లి మండలంలో ఒక ప్రబుద్ధుడు దగ్గుపాటి సాయిబాబు, దగ్గుపాటి సుజాత, కొత్త గంగారం నివాసముంటూ, కొంతకాలంగా డిష్ టీవీ కేబుల్ వైరు పెట్టుకుంటూ మండలంలో అందరితో పరిచయాలు ఏర్పరుచు కున్నాడు. ఆ తర్వాత టాటా స్కై డిష్ సన్ డైరెక్టర్ డిష్ లు అని ఇలాంటివి వచ్చే సరికి ఆయనకి ఉపాధి లేక లాటరీ స్కీములు అవతారం ఎత్తినాడు. నిరాశ రాశులు అయి నటువంటి అమాయకు లైన ఆదివాసీ మహిళలను ఈ రకంగా ఘరానా మోసం చేసి ఊరు పొలిమేర విడిచి వెళ్ళిపోయి బయటపడ్డారు. ఘరానా మోసం ఫ్రిజ్జులు, కూలర్లు, మిక్సీలు, కుక్కర్లు, ఫ్యాన్లు, స్మార్ట్ ఫోన్లు, గోల్డ్ చైన్లు, వెండి పట్టీలు,ఎల్ ఈ డి టీవీలు, స్కూటర్లు, హీరో హోండాలు, వారానికి 250. 300. 500. 1000 ఇలా పెద్దపెద్ద వస్తువులు ఆశ చూపించి లా ట్రీ పేరుతో ఎగనామం వేశారు. లాట్రీ తగిలినాక ఆ లాట్రీ వస్తువులు పేరు కూడా చెప్పకుండా వచ్చిందని, తగిలితే వస్తువులు ఇస్తామని సంవత్సరమైనా కూడా మాకు ఇవ్వకుండా.. వాయిదాలు

చెప్పి, చెప్పి పూర్తిగా కొత్త గంగారం లో ఉన్నటువంటి నాలుగు గదుల ఇంటినే

8 లక్ష యాభై వేలకి మరి అమ్మేసి మరి ఆ సాయి బాబు సుజాత వెళ్ళిపో రు. అని

ఆ బాధిత మహిళ లో (60) (70) సంవత్సరాలు నిండిన ముసలోళ్ళు వృత్తులు కూడా ఉన్నారని వారు అంటున్నారు.

ములకలపల్లి మండలం కేంద్రంలో నమ్మి మోసం పోయిన ఆదివాసీ మహిళలు చెబుతున్న టువంటి మాటలు.

ప్రతిరోజు పొద్దున్నే లేచి ఎండనక వాననక కూలి పనులకు వెళ్లి కడుపు మాడ్చుకుంటూ, ఆ కూలీ

డబ్బులు తెచ్చి స్కీములు పేరుతో ఇంత మోసగాడు అని తెలియక ఈ దగ్గుపాటి సాయిబాబుకి భార్య దగ్గుపాటి సుజాతకి కట్టమని గుండెలు అదిరే అట్లు ఏడ్చుకుంటూ వాపోతున్నారు. ఒక్క మహిళ దగ్గర 7.000, 8.000, 10.000, 15.000, రూపాయలు ములకలపల్లి మండలం మొత్తంలో ఒక్కొక్క ఊర్లో 1.50000/- 2.00000/- ల మరియు 2.50000,ల రూపాయలు అమాయకులు అయినటువంటి ఆదివాసీ గిరి బిడ్డల దగ్గర వసూలు చేసి వెళ్లిపోయారని ఆదివాసి మహిళలు వాపోతున్నారు.

ఆ దగ్గుపాటి. సాయి బాబును, సుజాతను, ఎలాగైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని

ఆ మహిళలు ఏడ్చుకుంటూ మాట్లాడిన మాటలు, పోలీసులకి ఫిర్యాదు ఇచ్చి మరి, ఆయన దగ్గరున్న సొమ్మును రీకవరి చేసుకొని, తీసుకొస్తామని, ఇంట్లో ఏమ్ ఉంటే అవి మోసుకొస్తా మనీ కంకణం కట్టుకొని ఉన్నామని అంటున్నారు. అబద్ధం చెప్పి మోసం చేసి వెళ్లి పోతాడు అని తెలియక కడుపు మార్చుకుని ఒక్క రూపాయి రూపాయి కూడా పెట్టి మరి, ఆ స్కీములు కట్టమని అంటున్నారు.

ఆ దగ్గుపాటి సాయి బాబు ఆయన భార్య దగ్గుపాటి, సుజాత., గనక కనిపిస్తే

చీపురుకట్టను తిరిగేసి మరీ కొడతామని, కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తామని బాధిత మహిళలు అంటున్న టువంటి మాటలు. దగ్గుపాటి సాయిబాబు మోసం చేసిన నిరాశ రాసులు అయినటువంటి ఆదివాసీ ఆడబిడ్డలు. మండల కేంద్రంలో ఆ సాయి బాబు ద్వారా మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే బయటికి రాగలరని జ్యోతి

కోరుకుంటున్నారు. బాధిత మహిళలు ఉన్నటువంటి వారి పేర్లు సునీత, వనిత, బేబీ, వెంకటరమణ, రామలక్ష్మి. చిలకమ్మ, సూరమ్మ. మొదలైన వారు ఉన్నారు.