విద్యకు దూరమైన విద్యార్థులు

చౌ ల తండా విద్యార్థులు విద్యకు దూరమైన వైనం.
మండల విద్యాధికారి ఇష్టారాజ్యం తో కష్టాలు.
పిల్లలు ఉన్న చోట సార్లు లేక పోయే..
పాఠశాలలో ఒక్క పిల్లవాడికి ఒక టీచర్ కు డ్యూటీ వేసే
కేశవపురం, మొండికుంట తండా విద్యార్థులు నడిచి పాఠశాలకు వెళ్తున్న వైనం
తుంగతుర్తి ,ఫిబ్రవరి 21 నిజం న్యూస్.
అధికారుల పరిపాలన , పనితీరు, సక్రమంగా ఉంటేనే సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంటది. ఇందుకు భిన్నంగా మండల విద్యాధికారి, తన ఇష్టారాజ్యం తో, తనకిష్టమైన వాళ్ళకే, డిప్యూటేషన్, ఇస్తుండడంతో, మండలంలోని బండ రామారం పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులకు ఒకే ఒక మహిళా ఉపాధ్యాయురాలు, కష్టాలు చవిచూస్తుంది. మొండి కుంట తండా లో పాఠశాలలో ఒక విద్యార్థి ఉండగా… ఆ విద్యార్థి పాఠశాలకు వస్తాడో , రాడో తెలియదు కానీ, అక్కడ మాత్రం ఓ టీచర్ డ్యూటీ చేస్తుండడం పరిపాలనా విధానానికి నిదర్శనం. రావులపల్లి ఆవాస ప్రాంతమైన తండాలో ఉన్న విద్యార్థులు, ప్రక్కన పాఠశాల కు వెళుతున్నారు లే దో ఎవరికి తెలియదు. మండలంలో ఈ విధంగా పాఠశాల లలో పని చేసిన ఉపాధ్యాయు లు తీరుకు కారణం మండల బాస్ కారణమని చెప్పవచ్చు.
ఇక విద్యార్థుల బోధన విషయానికి వస్తే పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల కొరత తో, సబ్జెక్టుల్లో సెలబస్ కాకపోవడం వెలుగు పెళ్లి లో ఓ ఉపాధ్యాయుడు లెక్కల సబ్జెక్టు చెప్పకుండా పట్టించుకోక పాయె, పరీక్షల్లో ఏమి చదవాలో, ఏమి రాయాలో తెలియని పరిస్థితి దాపురించిందని, కొంతమంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలో నెలకు ఒకసారైనా, పర్యవేక్షణ చేయకపోవడంతో ఇష్టారాజ్యం తో ఫీజులు వసూలు చేస్తున్న, ఫీజులు కట్టలేదని సాకుతో యాజమాన్యం, విద్యార్థులను బయట గంటల తరబడి నిలబెడుతున్న ఇదే మీ పాపం అని అడిగితే , ప్రైవేటు పాఠశాలలో ఫీజులు ఇవ్వకుంటే అట్లా నిలబడతారని ఆ దానం మండల విద్యాధికారి చెప్పడం శోచనీయం. మేరీ మదర్ పాఠశాలపై, గతంలో ఫిర్యాదు చేసిన, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , కోట్ల రూపాయల నిధులతో, ముందుకు వెళ్తున్న తరుణంలో, మండల విద్యాధికారి ఇష్టారాజ్యం తో ఒక పక్క విద్యార్థులు, మరొక ప్రక్క బోధన చేస్తున్న ఉపాధ్యాయులు కష్టాలు పడుతుండడం, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా, పరిపాలన వ్యవస్థ మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. మండలంలోని ఈ ఈ సమస్యలకు కారణమైన మండల అధికారి పై, జిల్లా ఉన్నతాధికారి, విచారణ జరపాలని, మండల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, కోరుతున్నారు.