న్యాయం చేయాలని తల్లి కూతుళ్ళ అత్మ హత్యా యత్నం

-భూ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని తల్లి కూతుళ్ళ అత్మ హత్యా యత్నం

నిజామాబాద్,ప్రిబ్రవరి21(నిజం న్యూస్): నిజామాబాద్‌ కలెక్టరేట్లో భూ వివాదంపై తమకు న్యాయం చేయాలని తల్లి కూతుళ్లు పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నందిపేట్ మండలం,శాపూర్ గ్రామానికి చెందిన సుజాత తన,భూమి సమస్యల విషయమై అధికారులు,పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారించడం లేదన్నారు. ఏమి చేయాలో దిక్కుతోచక తన కూతురు కలిసి పెట్రోల్ తిసుకోచ్చి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసింది. కలెక్టర్ బాధితురాలి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.