షోకాజ్ నోటీసులు జారీచేసిన డిపివో
అనంతగిరి, ఫిబ్రవరి 20 (నిజం న్యూస్)
మండల పరిధిలోని వసంతపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ,కార్యదర్శులకు మండల పంచాయతీ అధికారి తుమ్మల నాగేశ్వరరావు కు షోకాజ్ నోటీసులు డి పి ఓ యాదయ్య జారీచేశారు వివరాల్లోకి వెళితే పల్లె ప్రకృతి వనం పనులలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉపయోగించకుండా నిధులు డ్రా చేసిన సంఘటనలో సర్పంచ్ శ్రీనివాసరావు కి ఉప సర్పంచ్ నాగరాజు కి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే ఉప సర్పంచ్ నాగరాజు సర్పంచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి గురులక్ష్మి పై ఫిర్యాదు చేయగా నిధుల దుర్వినియోగానికి గురైనట్లు డి ఎల్ పి ఓ శ్రీరాములు విచారణ చేసి నిర్ధారించారు. ఇరువురికి నోటీసులు జారీ చేశారు ఈ నెల 8న పోచంపల్లి గ్రామ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే దీనిని సాకుగ చూపుతూ మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీ కార్యదర్శి లు సెలవుపై వెళ్లడంతో ఎంపీవో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు డిపిఓ యాదయ్య జారీ చేశారు.