ప్రమాదం మీద ప్రయాణం
రహదారిపై వీల్ లేని లోడు ట్రాక్టర్ తో విన్యాసం
నిలువెత్తు నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాలతో చెలగాటం
చివ్వెంల,ఫిబ్రవరి 20(నిజం న్యూస్)
నిలువెత్తు నిర్లక్ష్యం తో ఓ ట్రాక్టర్ డ్రైవర్ రహదారి పై విన్యాసాలు చేస్తూ ప్రమాదం పై కూర్చుని మరీ లోడు తో వెళ్తున్న సంఘటన మండలం లోని ఐలాపురం స్టేజి వద్ద రోడ్డు పై ప్రయాణించే వారిని భయబ్రాంతులకు గురిచేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….జిల్లా కేంద్ర శివరులో ఉన్న ఓ రైస్ మిల్లు లో ట్రాక్టర్ లో వరి పొట్టను నింపుకొని ట్రాక్టర్ ఇంజిన్ ముందు భాగంలో ఉన్న ఓ చక్రం ఇది వరకే ఊడి పోయి ఉంది అయినా సరే ఆ వాహనాన్ని ట్రాక్టర్ డ్రైవర్ నడుపుకుంటూ వెళ్తుండడం తో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురై ఆశ్చర్య పోతున్నారు.ట్రాక్టర్ భారీ ఎత్తున లోడుతో ఉండడం తో ప్రమాదం జరిగితే ట్రాక్టర్ పై ఉన్న నలుగురి తో పాటు ప్రయాణికులు ప్రమాదం భారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.