యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20(నిజం న్యూస్)
సినీ నటుడు శ్రీకాంత్ ఆదివారం నాడు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని, ఆలయాన్ని చూస్తుంటే స్వర్గంలోకి అడుగుపెట్టినట్టు ఉందని తెలిపారు.సీఎం కేసీఆర్ యజ్ఞంలా తీసుకుని తిరుపతిల యాదాద్రి నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, ఆలయ ప్రారంభం తరువాత ఉంటుందన్నారు. రాత్రి ఇంకా సమయంలో అద్భుతంగా కాంతులతో యాదాద్రి ఆలయం ప్రకాశవంతంగా తెలిసిందన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు..