రోడ్డు ప్రమాదం లో ఉపాధ్యాయుడు మృతి

గట్టికల్ లో విషాదఛాయలు
ఆత్మకూరు ఎస్….
మండలపరిధిలో ని గట్టికల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పేరం శ్యాంసన్ 56. ఆదివారం సూర్యాపేట లో ని కుడ కుడరోడ్డు లో టిప్పర్ డికొన్న ప్రమాదం లో మృతి చెందాడు.సూర్యాపేట లోచర్చిలో ప్రార్ధన కు వెళ్లి తిరిగి గట్టికల్ కు బైక్ వస్తుండగా వెనుక నుండి టిప్పర్ డి కొట్టడం తో శ్యాంసన్ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెలుతుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.ఉపాధ్యాయుడుగా ఎన్నో ప్రాంతాలు పొరుగు జిల్లాల్లో పని చేసినప్పటికీ సొంత ఊరులో ఇల్లు కట్టుకొని క్రమం తప్పకుండా విధులకు వెళ్లే వారు. గ్రామం లో యువకులు విద్య పట్ల శ్రద్ద చూపాలంటూ చైతన్య వంతమైనకార్యక్రమాలు చేపట్టే వారు. మృతునికి భార్య ఒక కూతురు కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామాంజపురం పాఠశాలలో పని చేస్తున్నారు.