తేనేటీగల దాడిలో ఐదుగురికి గాయాలు

ఎల్లారెడ్డిపేట, పిబ్రవరి 20,(నిజం న్యూస్):
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తేనెటీగల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఆదివారం ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ సమీపంలో నీ బాపురెడ్డి టిఫిన్ సెంటర్ ఎదుట నిలబడి ఉన్న బాబుపై తేనేటీగలు దాడి చేశాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ దుర్గం విజయ్ బాబు గమనించి ఆ బాబును పరుగెత్తుమంటూ కేకలు వేశాడు.
ఆ తేనెటీగలు విజయ్ బాబు తో పాటు అక్కడే ఉన్న మరో జర్నలిస్ట్ జగధీశ్ పై అటువైపు గా వెళుతున్న ఇద్దరు అమ్మాయిలపై దాడిచేశాయి. ఈ దాడిలో ఇద్దరు అమ్మాయిలు,విజయ్ బాబు తీవ్రంగా గాయపడ్డారు ,జగదీష్ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అతన్నీ మండల కేంద్రంలోనీ ఆశ్వీణీ ఆసుపత్రికి తరలించగా వెంటనే ఆశ్వీణీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి విజయ్ బాబుకు ఉచిత వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు .అతన్నీ జర్నలిస్ట్ జగదీష్ , టిఆర్ఎస్ పార్టీ పట్టణ అద్యక్షులు బండారి బాల్ రెడ్డి , వెంకటాపూర్ తన ఇంటికి తరలించారు.సమీపంలో ఉన్న తేనేపట్టుపై ఆకతాయిలు రాళ్లు విసరడంతో తేనెటీగలు చెదిరిపోయి దాడి చేశాయని తెలిసింది.ఈ కారణంగానే ఒక్కసారిగా గందర గోళం ఏర్పడింది.