దంతేవాడ జిల్లాలో ఎన్ కౌంటర్..మావోయిస్టు మృతి

దంతేవాడ జిల్లాలో ఎన్ కౌంటర్

మావోయిస్టు మృతి

ఆయుధం, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న డీఆర్జీ జవాన్లు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బూర్గం అటవీ ప్రాంతంలో నక్సల్స్, డీఆర్జీ జవాన్ల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన లో ఒక మావోయిస్టు మృతి చెందారని దంతేవాడ జిల్లా ఎస్పీ సిద్ధార్థ తివారీ తెలిపారు.
హతమైన నక్సలైట్ పై రూ.5 లక్షల రివార్డు ఉందని తెలిపారు. నక్సలైట్‌ను ఏరియా కమాండర్ అర్జున్ సోరిగా గుర్తించారు.
బూర్గం అడవుల్లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు నాయకులు గుమిగూడినట్లు పోలీసులకు సమాచారం అందిందని, ఈ సమాచారం మేరకు దంతేవాడ నుంచి డిఆర్‌జి దళాలను రంగంలోకి దిగారు. భద్రతా బలగాల పై నక్సలైట్లు కాల్పులు జరిపారు. సైనికులు ఎదురుదాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు, సైనికులు కాల్పులు జరిపిన తర్వాత సంఘటన స్థలాన్ని పరిశీలించినప్పుడు, అక్కడ నుండి ఒక నక్సలైట్ మృతదేహాన్ని కనుగొన్నారు జవాన్లు ఘటనా స్థలంలోనే ఒక పిస్టల్, టిఫిన్ బాంబు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.