Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ప్రారంభం

డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ,22యార్డ్స్ ఇంటర్‌స్టేట్ ఫ్లడ్‌లైట్స్ యార్డ్స్ ఛాంపియన్‌షిప్) ను ప్రారంభం

రాష్ట్ర టూరిజం చైర్మన్ శ్రీ.ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ ,ఫిబ్రవరి 20 నిజం న్యూస్

హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ విజయనంద్ గ్రౌండ్ లో ఆదివారం రోజున మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో.. డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ సీసన్-9*
22యార్డ్స్ ఇంటర్‌స్టేట్ ఫ్లడ్‌లైట్స్ యార్డ్స్ ఛాంపియన్‌షిప్) ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా *తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ.ఉప్పల శ్రీనివాస్ గుప్త . ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ క్రికెట్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 హాస్పిటల్స్ టీంలతో నిర్వహిస్తున్నారు. ఈరోజు మెడికవర్ డాక్టర్ వర్సెస్ రెయిన్ బో డాక్టర్స్ మ్యాచ్ కు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ను ప్రారంభించి, కాసేపు సరదాగా క్రికెట్ ఆడటం జరిగింది.
గత 9 సంవత్సరాలుగా మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో.. డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లను నిర్వహించడం జరుగుతుంది అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 హాస్పిటల్స్ టీంలతో యశోద, అపోలో,రెయిన్ బో, మెడికవర్ మొదలగు హాస్పిటల్ కు సంబంధించిన డాక్టర్లు ఈ పోటీలు పాల్గోననున్నారు.
డాక్టర్లు నిత్యం ఆసుపత్రులలో వైద్యసేవలు అందిస్తూ ప్రజా సేవలో ఉంటారు. అలాంటి వారు ఇలా సెలవురోజు విరామం దొరికినప్పుడు ఇలా క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డాక్టర్లు అందరూ అద్భుతమైన సేవలు అందించారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో.. వాసురాజు మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందపాండే కో ఫౌండర్ నిఖిల్ డాక్టర్స్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.