బస్సు బోల్తా…ముగ్గురు మృతి..ఆరుగురికి గాయాలు

అనంతపురం జిల్లాలో తిరుమల నుంచి భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.